ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్ నుంచి రైలులో కీవ్ కు వెళ్లిన భారత ప్రధాని

Update: 2024-08-23 06:46 GMT

భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలాండ్ నుంచి రైలులో పది గంటలకు పాటు ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధికారులు, అక్కడి భారత సంతతి ప్రజలు, ఇస్కాన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలన్ స్కీతో భేటీ కానున్నాయి. సోవియట్ నుంచి ఉక్రెయిన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో మోదీతో జెలెన్ స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను మోదీ కౌగిలించుకోవడాన్ని జెలెన్ స్కీ తప్పుబట్టారు. మోదీ ఒక క్రిమినల్ ను కౌగిలించుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులతో రెండేళ్లుగా వేలాది మంది ప్రజలు మరణించారు. కీవ్ నగరం రష్యా బలగాల దాడిలో తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని ఆదేశంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News