వరద బాధితులని కాపాడటంలో నిర్లక్ష్యం.. అధికారులకు ఉరిశిక్ష

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ దేశంలో వరదల సమయంలో ప్రజలను కాపాడని 30 మంది అధికారులకు ఉరిశిక్ష విధిస్తునట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది.

By :  Vamshi
Update: 2024-09-04 11:20 GMT

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ దేశంలో వరదల సమయంలో ప్రజలను కాపాడని 30 మంది అధికారులకు ఉరిశిక్ష విధిస్తునట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది. ఉత్తర కొరియాలో చాంగాంగ్ ప్రావిన్స్ వరదల్లో 1000 మందికి పైగా ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు.

ఆయన నియంతలా వ్యవహరిస్తారు. ప్రపంచ దేశాలకు ఈ విషయం తెలుసు. అందుకే కిమ్‌కు నియంత పెట్టిన పేరు అంటుంటారు. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అంతమందికి ఉరి శిక్ష విధించడంతో ఉత్త‌ర కొరియాపై విమర్శలు వ‌స్తున్నాయి. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి కానీ ఉరిశిక్ష విధించడం కరెక్ట్ కాదని పలు దేశాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి

Tags:    

Similar News