ముంబయిలో టీమిండియా క్రికెటర్ల విజయ యాత్ర.. పోటెత్తిన క్రికెట్‌ ఫ్యాన్స్

ముంబయిలోని సముద్ర తీరం క్రికెట్ అభిమానులతో పోటెత్తింది. టీ20 ప్రపంచకప్‌ విజేత టీమిండియా విజయ్ పరేడ్‌ను చూడడానికి ఫ్యాన్స్ లక్షలాదిగా తరలివచ్చారు.

By :  Vamshi
Update: 2024-07-04 16:00 GMT

ముంబాయిలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. టీ-20 వరల్డ్ కప్‌తో వచ్చిన ఆటగాళ్లకు చూడడానికి ఫ్యాన్స్ లక్షలాదిగా తరలివచ్చారు. ముంబయిలోని సముద్ర తీరం క్రికెట్ అభిమానులతో పోటెత్తింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆటగాళ్లకు అభివాదం చేశారు. ముంబైలోని నారిమన్ పాయింట్‌ నుంచి క్రికెటర్ల రోడ్‌పో ప్రారంభమైంది. వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్‌ షో కొనసాగింది. ఓపెన్‌ టాప్‌ బస్సులో ముంబయి రహదారులపై క్రికెటర్ల ఊరేగింపు కొనసాగింది. దీంతో మెరైన్ డ్రైవ్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు అభిమానులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.

మరోవైపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టేడియానికి అభిమానులు వేలాదిగా వచ్చారు. ఇప్పటికే గ్యాలరీలన్నీ ప్రజలతో నిండిపోయాయి. మరోవైపు విశ్వవిజేతలు ముంబయికి వస్తున్న వేళ వరుణుడు కరుణించారు. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తున్నది. కాగా, ముంబయిలో టీమ్‌ఇండియా క్రికెటర్ల రోడ్‌ షో ప్రారంభమైంది. ఈ సాయంత్రం వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా అందించారు

Tags:    

Similar News