టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ..స్కాట్‌లాండ్‌తో రెండో టీ20లో ఆసీస్ జయభేరి

ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ రికార్డు సృష్టించాడు. ఆ టీమ్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లిస్ కేవలం 43 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.

By :  Vamshi
Update: 2024-09-07 04:54 GMT

స్కాట్‌లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన తొలి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌గా చ‌రిత్ర సృష్టించాడు. 43 బంతుల్లోనే జోష్ సెంచరీ పూర్తి చేశాడు. 2013లో 47 బంతుల్లో మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ సెంచరీ చేయగా, ఇప్పుడు జోష్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచులో స్కాట్లాండ్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది.

ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసింది. ఆసీస్ తరుపున ఇంగ్లిస్(49 బంతుల్లో 103 పరుగులు;7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), గ్రీన్(29 బంతుల్లో 36 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ ఒక్కడే 3 వికెట్లతో రాణించాడు.197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ 4 వికెట్లు తీయగా, గ్రీన్ 2 వికెట్లు పడగొట్టాడు. కాగా మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో రెండు మ్యాచులు గెలిచిన ఆసీస్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను (2-0)తో కైవసం చేసుకుంది.

Tags:    

Similar News