స్వదేశానికి టీమిండియా.. అభిమానుల ఘనస్వాగతం

టీ20 ప్రపంచకప్‌ సాధించిన టీమిండియా కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి రావాలానుకున్న వెస్టిండీస్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా రోహిత్‌ సేన రాక ఆలస్యమైంది.

By :  Raju
Update: 2024-07-04 02:41 GMT

సుదీర్ఘ కాలం తర్వాత ఐసీసీ టీ 20 వరల్డ్‌ కప్‌ సాధించిన టీమిండియా సగర్వంగా భారత్‌కు చేరుకున్నది. భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రోహిత్‌ సేనకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం లభించింది. ఉదయం 11 గంటలకు రోహిత్‌ సేన ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నది.

ప్రధానితో భేటీ ముగిశాక ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి రోడ్‌ షో ప్రారంభమౌతుంది. ముంబయి ప్రధాన రోడ్లపై రెండు గంటల పాటు సాగే ఈ ఊరేగింపులో రోహిత్‌ బృందం ఓపెన్‌ టాప్‌ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేయనున్నారు. అనంతరం రాత్రి వాంఖెడి స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియాకు సన్మాక కార్యక్రమం ఉంటుంది. 

ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి టీ 20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలుచుకున్నది. ఈసారి ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా కప్‌ గెలువడం విశేషం. 

Tags:    

Similar News