టీ 20 వరల్డ్‌ కప్‌: అమెరికాపై వెస్టిండీస్‌ విజయం

సెమీస్‌పై కన్నేసిన భారత్‌ నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్నది. రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానున్నది.

By :  Raju
Update: 2024-06-22 05:18 GMT

టీ 20 వరల్డ్‌ కప్‌ పోటీల్లో భాగంగా సూపర్‌ 8లో జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్‌ బౌలర్లలో రసెల్, రోస్టన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు. మొదట బ్యాటింగ్‌ చేసిన అమెరికా 19. 5 ఓవర్లలో 128 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఒక్క వికెట్‌మాత్రమే కోల్పోయి 10.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్‌ బ్యాటర్‌ షై హోప్‌ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోయిన విండీస్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్నది.

మరోవైపు టీ 20 ప్రపంచకప్‌లో సూపర్‌8లో అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించిన భారత్‌ నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్నది. ఇరు జట్ల బలాబలాలు చూస్తే భారతే ఫేవరేట్‌గా కనిపిస్తున్నది. బంగ్లాదేశ్‌ సూపర్‌ 8లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ ఆ జట్టు ప్రపంచ క్రికెట్లో పెద్ద జట్లను ఓడించిన చరిత్ర ఉన్నది. భారత్‌పై కూడా అనేకసార్లు గెలిచింది. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లో తడబడుతూ.. తర్వాత పుంజుకొని విజయం సాధిస్తున్న భారత్‌ సెమిస్‌పై దృష్టి సారించింది. దీంతతో ఈ మ్యాచ్‌ కీలకమైనది.

Tags:    

Similar News