భారత్‌కు షాక్‌.. వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ 50 కిలోల విభాగంలో ఉండాల్సిన నిర్ణీత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉన్నదనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది.

By :  Raju
Update: 2024-08-07 06:52 GMT

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌ మరో పతకం ఖాయమనుకుంటున్న సందర్భంలో భారత అభిమానులకు షాక్‌ తగిలింది. భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ 50 కిలోల విభాగంలో ఉండాల్సిన నిర్ణీత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉన్నదనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారిస్‌ ఒలింపిక్‌ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌ మహిళల 50 కిలోల విభాగంలో ఫొగాట్‌ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆమె బరువు 100 గ్రాములు పెరగడంతో వినేశ్‌ పతకం ఆశలు గల్లంతయ్యాయి.

50 కిలోల విభాగంలో పోటీ పడేవారు 52 కిలోల వరకు ఉండవచ్చు. అయితే 52 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో రాత్రంతా నిద్రపోకుండా తగ్గే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ క్రమంలో ఆమె బరువు చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్స్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.

మరోవైపు మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం పట్ల ఇండియన్‌ ఒలింపిక్‌ సంఘం విచారం వ్యక్తం చేసింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది "రాత్రిపూట జట్టు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే కొన్ని గ్రాముల బరువు పెరిగింది. ఈ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. వినేశ్‌ గోప్యతను గౌరవించాలని భారత జట్టు మిమ్మల్ని అభ్యర్థిస్తోంది. దీని గురించి ఆలోంచకుండా మీ పోటీలపై దృష్టి పెట్టాలని ఒక ప్రకటనలో కోరింది. 

Tags:    

Similar News