పీవీ సింధు అఖండ విజయం..షూటింగ్ ఫైనల్‌లోకి రమితా

పారిస్ ఒలింపిక్స్ లో రమితా జిందాల్ షూటింగ్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. పీవీ సింధు అఖండ విజయం సాధించింది.

By :  Raju
Update: 2024-07-28 08:59 GMT

పారిస్‌ ఒలింపిక్స్‌ పోటీల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాన అబ్దల్‌ రజాక్‌పై 21-9, 21-6 తేడాతో ఆమె గెలుపొందింది. సింధు ఈ మ్యాచ్‌ను 29 నిమిషాల్లోనే ముగించింది. గ్రూప్‌ స్టేజ్‌లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారణి క్రిస్టినా కూబాతో పీవీ సిందు తలపడనున్నది.

ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌.. ఫైనల్‌కు రమిత

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్‌ సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో భారత్‌కు చెందిన రమితా జిందాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 631.5 పాయింట్లతో ఆమెఐదో స్థానంలో నిలిచింది.

రోయింగ్స్.. క్వార్టర్స్‌ బాల్‌రాజ్‌

రోయింగ్‌ మెన్స్‌ సింగిల్స్‌ పోటీల్లో బాల్‌రాజ్‌ పన్వార్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. రెండో రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో పన్వార్‌ సత్తా చాటాడు. మొనాకో అథ్లెట్‌ క్వింటిన్‌ అంటోగ్నెల్లి మొదటి స్థానం సాధించగా.. రెండో స్థానంలో బాల్‌రాజ్‌ క్వార్టర్స్‌కు దూసుకుపోయాడు.

మధ్యాహ్నం పిస్టల్‌ ఫైనల్‌ పోరు

మరోవైపు నేడు మ ధ్యాహ్నం 3.30 గంటలకు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ పోరు జరగనున్నది. 10 మీటర్ల షూటింగ్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన మను బాకర్‌. అర్హత రౌండ్‌లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను.

Tags:    

Similar News