రెజ్లింగ్‌ సంఘం నుంచి మద్దతు లేదు.. వినేశ్‌ భర్త షాకింగ్ కామెంట్స్

భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ భర్త సోమ్‌వీర్ రాథీ ఆరోపించారు.

By :  Vamshi
Update: 2024-08-17 12:32 GMT

భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ భర్త సోమ్‌వీర్ రాథీ ఆరోపించారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌లో అనర్హత వేటుకు గురైన ఫొగాట్‌కు డబ్ల్యుఎఫ్‌ఐ మద్దతు నిలవలేదని విమర్శించారు. అథ్లెట్లకు మద్దతు లేకపోతే నిర్బంగా ఎలా ప్రదర్మన చేయగలరని ప్రశ్నించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిందని ఇంతటి అపరూప స్వాగతం తాము ఉహించలేదన్నారు. ఈ సందర్భంగా సోమ్‌వీర్‌ను మీడియా ప్రశ్నించింది.

వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించగా... ఆయన నుంచి సమాధానం రాలేదు.యావత్ భారతం ఫొగాట్‌పై అభిమానం కురిపిస్తోందని, దీనిని తాము ఊహించలేదన్నారు. సహచరుల నుంచి కూడా మంచి మద్దతు లభించిందన్నారు. ఇంతటి అభిమానం కురిపిస్తున్నందుకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. కొద్దిలో పతకం చేజారిందని... ఆ తర్వాత సీఏఎస్‌లోనూ మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు

Tags:    

Similar News