బంగ్లాపై భారత్‌ ఘన విజయం.. సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయమే!

టీ 20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8 మ్యాచ్‌లో భారత్‌ 50 పరుగులు తేడాతో బంగ్లా దేశ్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయమైనట్టే.

By :  Raju
Update: 2024-06-23 03:36 GMT

టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. శనివారం గ్రూప్‌-1 సూపర్‌ 8 మ్యాచ్‌లో భారత్‌ 50 పరుగులు తేడాతో బంగ్లా దేశ్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయమైనట్టే. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (37), రిషబ్‌ పంత్‌ (36), శివమ్‌ దూబె (34) దూకుడుగా ఆడటంతో భారీ స్కోర్‌ సాధ్యమైంది. బంగ్లా బౌలర్లలో తంజిమ్‌ హసన్‌ 2, రిషాద్‌ హుస్సేన్‌ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ దిగిన బంగ్లా జట్టు ఆరంభంలో బాగానే ఆడింది. 4.2 ఓవర్లలో ఒక్క వికెట్‌ నష్టపోకుండా 35 పరుగులతో మెరుగ్గానే కనిపించింది. అయితే తన బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టిన లిటన్‌ దాస్‌ (13)ను తర్వాత బాల్‌కే ఔట్‌ చేసిన కుల్‌దీప్‌ యాదవ్‌ భారత్‌కు మొదటి వికెట్‌ అందించాడు. ఆ తర్వాత అతని మాయాజాలం మొదైలంది. ఫామ్‌లో ఉన్న తంజిత్‌ (29), తౌహిద్‌ (4)ల వికెట్లను పడగొట్టిన కుల్‌దీప్‌ బంగ్లా జట్టును కోలుకోని దెబ్బతీశాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), బుమ్రా (2/130 విజృంభించడంతో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో నజ్ముల్‌ శాంట్ (40) ఒక్కడే రాణించాడు. హాఫ్‌ సెంచరీ చేసిన హార్దిక్‌ పాండ్యకే మాన్‌ ఆప్ ది మాచ్ఛ అవార్డు దక్కింది.

Tags:    

Similar News