రేపే ఇండియా-పాక్ మ్యాచ్.. రోహిత్‌కు గాయం!

Byline :  Vamshi
Update: 2024-06-08 07:58 GMT

దాయాదుల పోరుకు ముందు టీమ్ఇండియా షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్‌శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం రోహిత్‌శర్మ నెట్ ప్రాక్టీస్‌లో హిట్ మ్యాన్ బొటన వేలుకు గాయమైనదని టాక్. ప్రాక్టీస్ పిచ్‌లో బంతి ఓనర్ బౌన్స్ అవుతుందని ఐసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం ఇబ్బంది పడ్డారు. ఐర్లాండ్ మ్యాచ్‌లో రోహిత్ గాయం కారణంగా గ్రౌండ్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి తెలిసిందే.. ఇప్పుడు కూడా ఫ్యాన్స్‌ అదే ఇంట్రెస్ట్‌ను కనబరుస్తున్నారు.

రేపు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు నుంచి రోహిత్‌ శర్మ చేయి నొప్పితో బాధపడుతున్నట్లు మ్యాచ్‌ తర్వాత వెల్లడించాడు. మరి ఆ నొప్పి తగ్గిందా? లేదా? అనే విషయంపై ఇప్పటి వరకు టీమిండియా నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అలాగే ఐర్లాండ్‌తో మ్యాచ్‌ తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కూడా రోహిత్‌కు స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. అందుకే క్రికెట్‌ అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే టీమిండియా ఓపెనింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతుంది. రెగ్యులర్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫామ్‌లో లేకపోవడంతో.. వామప్‌ మ్యాచ్‌లో సంజు శాంసన్‌, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని ఓపెనర్లుగా దింపింది టీమిండియా. వాళ్లిద్దరు విఫలం అయ్యారు. ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ కూడా జట్టుకు దూరం అయితే.. ఎలా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News