ఓపెనర్‌గా 15 వేల క్లబ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 15 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించి ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా నిలిచాడు.

By :  Raju
Update: 2024-08-04 04:33 GMT

టీమిండియా వన్డే, టెస్ట్‌ క్రికెట్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 15 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించి ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్‌ 552 ఇన్నింగ్స్‌లో 15,035 రన్స్‌ సాధించాడు.

రోహిత్‌ కంటే ముందు ఈ ఫీట్‌ సాధించిన క్రికెటర్లలో శ్రీలంక క్రికెటర్‌ సనత్‌ జయసూర్య 563 ఇన్నింగ్స్‌లో 19,298, వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ 506 ఇన్సింగ్‌లో 18,867, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్‌ 462 ఇన్సింగ్స్‌లో 18,744, దక్షిణాఫ్రికా బ్యాటర్‌ గ్రేమ్‌ స్మిత్‌ 421 ఇన్సింగ్స్‌లో 16,950, వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ 438 ఇన్నింగ్స్‌లో 16,120, భారత బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 400 ఇన్సింగ్స్‌లో 16, 119, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 342 ఇన్సింగ్స్‌లో 15,335, బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ 451 ఇన్సింగ్స్‌లో 15, 210, ఇంగ్లాండ్‌ బ్యాటర్ అలిస్టర్‌ కుక్‌ 374 ఇన్సింగ్స్‌లో 15,110 సాధించారు. 

Tags:    

Similar News