యూఏఈపై భారత్‌ ఘన విజయం

మహిళల ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

By :  Raju
Update: 2024-07-21 12:46 GMT

మహిళల ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ ఇషా రోహిత్‌ (38), కవిషా (40 నాటౌట్‌) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి 2 వికెట్లు పడగొట్టగా.. రేణుక, తనుజా, పూజా, రాధ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (66), రిచా ఘోష్‌ (64 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. షెఫాలీ 37, స్మృతి 13, హేమలత 2, జెమీయా 14 పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో కవిషా 2 వికెట్లు పడగొట్టగా.. హీనా సమైరా చెరో వికెట్‌ తీశారు. 

Tags:    

Similar News