క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నా: మనుబాకర్‌

టీవీలో సచిన్‌ ఆటను చూస్తూ పెరిగానన్న ఒలింపిక్‌ పతకాల విజేత మను బాకర్

By :  Raju
Update: 2024-08-31 09:32 GMT

స్టార్‌ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను పారిస్‌ ఒలింపిక్‌ పతకాల విజేత మను బాకర్ కలిసింది. కుటుంబంతో సహా సచిన్‌ ఇంటికి వెళ్లిన ఆమె తన పతకాలను క్రికెట్‌ దిగ్గజానికి చూపెట్టింది. ఈ సందర్భంగా మను బాకర్‌ మాట్లాడుతూ... 'నేను ఆయనను కలిసే ముందు మాట్లాడాను. అదో ప్రత్యేకమైన సంభాషణ అన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో సచిన్‌ చక్కగా వివరించారు. కష్టాలను ఎదిరించి ముందుకు సాగాలని సూచించారు. క్రికెట్‌ దిగ్గజంతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నట్లు మను బాకర్‌ వెల్లడించింది. టీవీలో సచిన్‌ ఆటను చూస్తూ పెరిగాను. నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు ఆయన మైదానంలో, ఆవల ఎక్కడికి వెళ్లినా టీవీలో వస్తే తప్పకుండా చూసేదానిని. ఆయనను కలవడం అద్భుతంగా అనిపిస్తున్నదని మనుబాకర్‌ చెప్పింది.

ఒలింపిక్‌ విజేతలకు ఎన్‌ఆర్‌ఏఐ సత్కారం

ఒలింపిక్‌ పతక విజేతలు మను బాకర్‌, స్వప్నిల్‌, సరబ్‌జోత్‌సింగ్‌లకు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సత్కరించింది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నగదు బహుమతులను ఎన్‌ఆర్‌ఏఐ అధికారులు అందజేశారు. రెండు పతకాలు గెలిచిన మనుబాకర్‌కు రూ. 45 లక్షలు, స్వప్నిల్‌కు రూ. 30 లక్షలు, సరబ్‌జోత్‌ సింగ్‌కు రూ. 15 లక్షలు అందించారు.

Tags:    

Similar News