వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌ విజయం

టీ20 ప్రపంచకప్‌ లో ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడింది. సూపర్‌-8లో అతిథ్య జట్టు వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నది.

By :  Raju
Update: 2024-06-20 05:16 GMT

టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా సూపర్‌-8లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ మొదట విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సొంత మైదానంలో ఆడుతుండటంతో ప్రారంభంలో విండీస్‌ ఆటగాళ్లు రెచ్చిపోయి లీగ్‌ స్టేజ్‌లో భారీ స్కోర్లతో వణింకించారు.మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 17.3 ఓవర్లలో లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో సాల్ట్‌ (87), బెయిర్‌స్టో (48) రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఒకే ఓవర్‌లో 30 రన్స్‌

విండీస్‌ బౌలర్‌ రిమారియో షెఫర్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్ సాల్ట్‌ ఏకంగా 30 రన్స్‌ చేశాడు. వీటిలో మూడు ఫోర్లు, మూడు సిక్సర్స్‌ ఉన్నాయి.కీలక ఇన్నింగ్‌ ఆడిన సాల్ట్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Tags:    

Similar News