చరిత్ర సృష్టించిన కమిన్స్

ఆస్ట్రేలియా ఫేస్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ప్రపంచకప్‌ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

By :  Raju
Update: 2024-06-23 03:13 GMT

ఆస్ట్రేలియా ఫేస్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ప్రపంచకప్‌ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియా-అప్ఘనిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ మరోసారి తన బౌలింగ్‌ సత్తా చాటాడు. మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన వరుసగా ముగ్గురు అఫ్ఘాన్‌ బ్యాటర్ల వికెట్లు తీశాడు. ఇన్సింగ్స్‌ 18 వ ఓవర్‌లో చివరి బాల్‌కు రషీద్‌ ఖాన్‌ను ఔట్‌ చేసిన కమిన్స్‌ .. 20 ఓవర్ మొదటి బాల్‌కే కరీం జనత్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బాల్‌కే గుల్బాదిన్‌ కూడా ఔట్‌ చేశాడు. వీళ్లంతా క్యాచ్‌లు ఇచ్చి డౌకౌట్‌గా వెనుదిరిగారు. ఇదే ఓవర్‌లో మూడో బంతికి అఫ్ఘాన్‌ బ్యాటర్‌ ఖరోటె ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్‌ వార్నర్‌ వదిలేశాడు. లేకపోతే వరుసగా నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించేవాడే. కమిన్స్‌ ఇటీవల బంగ్లాదేశ్‌ జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించిన సంగతి తెలిసిందే.

ఒకే వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. టీ20 ఇప్పటివరకు కమిన్స్‌ కాకుండా రెండసార్లు హ్యాట్రిక్‌ సాధించిన వాళ్లు నలుగురు మాత్రమే ఉన్నారు. లసిత్‌ మలింగ (శ్రీలంక), టిమ్‌ సౌథీ (న్యూజిలాండ్‌), మార్క్‌ పాల్వోవిక్‌ (సెర్బియా), వసీమ్‌ అబ్బాస్‌ (మాల్టా). టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 8 హ్యాట్రిక్స్‌ నమోదు కాగా, అందులో పాట్‌ కమిన్స్‌వే రెండున్నాయి. ఆస్ట్రేలియా తరఫున రెండుసార్లు ఈ ఘనత సాధించింది కూడా కమిన్సే

Tags:    

Similar News