వినేశ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం మార్చుకో: మహవీర్‌

రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతూ వినేశ్‌ ఫొగాట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆమె పెద్దనాన్న మహవీర్‌ ఫొగాట్‌ సూచించారు.

By :  Raju
Update: 2024-08-08 04:59 GMT

రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతూ వినేశ్‌ ఫొగాట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆమె పెద్దనాన్న మహవీర్‌ ఫొగాట్‌ సూచించారు. ఆమెతో కూర్చొని మాట్లాడి నిర్ణయం మార్చుకునేలా చూస్తానన్నారు. మళ్లీ తీవ్రంగా సాధన చేస్తే విజేతగా నిలువడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఎవరైనా సరే పతకానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆలోచనలే వస్తాయన్నారు. అయితే కోపం ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని మహవీర్‌ వెల్లడించారు.

ఫొగాట్‌ను మెడలిస్టుగానే సత్కరిస్తాం: నాయబ్‌ సైనీ

వినేశ్‌ ఫొగాట్‌ మెడలిస్టుగానే సత్కరిస్తామని హర్యానా సీఎం నాయబ్‌ సైనీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒలింపిక్స్‌ విజేతలకు ఇచ్చే రివార్డును ఆమెకు కూడా అందజేస్తామన్నారు. హర్యానా రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం ఆమెకు రూ. 4 కోట్ల రివార్డు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వినేశ్‌ వ్యవస్థలతో పోరాడి అలసిపోయింది? శశిథరూర్‌

మరోవైపు వినేశ్‌ ఫొగాట్‌ రిటైర్మెంట్‌పై ఎంపీ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. 'ఈ యువతి వ్యవస్థలతో అలసిపోయింది. పోరాడి పోరాడి ఆలసిపోయింది అని రాసుకొచ్చారు

Tags:    

Similar News