సూపర్ 8కు దూసుకెళ్లిన ఆప్గానిస్థాన్

పపువా న్యూగినియాపై ఆప్గాన్ ఘన విజయం

Byline :  Vamshi
Update: 2024-06-14 06:08 GMT

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో పాపునా న్యూగీనీపై ఆప్గాన్ 7 వికెట్ల తేడతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆప్గాన్ జట్టు సూపర్ 8కు దూసుకెళ్లింది. పస్ట్ బ్యాటింగ్ చేసిన పాపునా న్యూగీన జట్టు 95 పరుగులు చేయగా ఆప్గాన్ టీమ్ 15.1 ఓవర్లలోనే స్కోర్‌ను ఛేదించింది. అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ గులాబిదిన్‌ నయీబ్‌(36 బంతుల్లో 49 నాటౌట్‌) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 13, మహ్మద్‌ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్‌) ఆచితూచి ఆడారు. ఇక ఇప్పటికే వెస్టిండీస్‌ గ్రూప్‌-సి నుంచి సూపర్‌-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్‌ అయింది. ఆప్గానిస్థాన్ జట్టు టీ20 వరల్డ్‌కప్‌-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్‌-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌ ఫలితంతో న్యూజిలాండ్‌ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో ‌అఫ్గన్‌ జట్టు వెస్టిండీస్‌, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్‌-సిలో ఉంది.

Tags:    

Similar News