యూఎస్‌ ఓపెన్‌ లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కు షాక్‌

వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఇగా స్వైటెక్‌ క్వార్టర్స్‌ ఫైనల్‌లో ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగులా చేతిలో ఓటమి

By :  Raju
Update: 2024-09-05 07:22 GMT

యూఎస్‌ ఓపెన్‌ లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఇగా స్వైటెక్‌కు షాక్‌ తగిలింది. క్వార్టర్స్‌ ఫైనల్‌లో ఆమె ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2022 యూఎస్‌ ఓపెన్‌ విజేత అయిన స్వైటెక్‌.. క్వార్టర్‌ ఫైనల్‌లో మొదటి నుంచి తడబడింది. దీంతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జెస్సికా 6-2,6-4 తో వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌ లో బెర్త్‌ కోసం ఆమె చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరోలినా ముచోవాతో తలపడనున్నది.

మరో సెమీఫైనల్‌లో రెండో సీడ్‌ అరియానా సబలెంక (బెలారస్‌) ఎమ్మా నవారో (అమెరికా)ను ఢీ కొట్టనున్నది. ఇందులో సబలెంకను ఓడించి నవారో ఫైనల్‌కు చేరుకుంటే.. మరో సెమీస్‌లో జెస్సికా గెలిస్తే.. ఈసారి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో అమెరికన్లే తలపడినట్లవుతుంది. జెస్సికాకు ఇదే మొదటి గ్రాండ్‌ స్లామ్‌ సెమీఫైనల్‌.

Tags:    

Similar News