సింగరేణిపై కేంద్రం కుట్రలు తిప్పికొట్టాలి: ఘంటా చక్రపాణి

సింగరేణిపై ఢిల్లీ కుట్రలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టాలి. తెలంగాణ బొగ్గు నిల్వలు తెలంగాణ ప్రజల సంస్థ అయిన సింగరేణికే దక్కాలని ఆచార్య ఘంటా చక్రపాణి అన్నారు.

By :  Raju
Update: 2024-06-21 03:27 GMT

సింగరేణి మన సిరుల కల్పతరువు. 1920 ప్రాంతంలో అప్పటిదాకా ప్రైవేటు కార్పొరేషన్ గా ఉన్న తెలంగాణ బొగ్గు గనులను బ్రిటిష్ కంపెనీ నుంచి కొని మన నిజాం రాజులు మొట్టమొదటి ప్రజా యాజమాన్య సంస్థ ( పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ) గా రిజిస్టర్ చేసి ఇక్కడున్న బొగ్గు నిల్వలను మన అవసరాలకు వినియోగించుకునేలా సంస్థను ఏర్పాటు చేసి సింగరేణిని రూపొందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటీకరణ ప్రయత్నాలను తిప్పికొట్టి నిలబడిన సింగరేణి ఇప్పుడు గనులు, నిల్వలు బ్లాక్ ల వారీగా వేలం కోసం వేలాడుతోంది. కేంద్రం మన మంత్రితోనే మన కంటిని పొడిచే ప్రయత్నం చేస్తోంది. ఇది తెలంగాణకు పెనుముప్పు. తెలంగాణవాదులు, మేధావులు, విద్యావంతులు, జాక్ లు సింగరేణికి దన్నుగా నిలవాల్సిన సందర్భం. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ కుట్రలను తిప్పికొట్టాలి. తెలంగాణా బొగ్గు నిల్వలు తెలంగాణ ప్రజల సంస్థ అయిన సింగరేణికే దక్కాలి. ఇప్పుడు నిందలు కాదు. మన వనరులు కాపాడుకోవాలి.

- ఆచార్య ఘంటా చక్రపాణి, టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్‌

Tags:    

Similar News