తేడా వస్తే తెలంగాణ సమాజం తెగిస్తుంది: ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీలో తేడా వస్తే తెలంగాణ సమాజం తెగిస్తుంది. ఈసారి మళ్ళీ తెగేదాకా కొట్లాడుతుంది. ఇప్పుడు ఆ అవసరం రాకూడదని ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ట్విటర్‌లో రాసుకొచ్చారు.

By :  Raju
Update: 2024-07-06 09:09 GMT

విభజన సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్‌లో నేడు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీపై మాజీ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి చేసిన ట్వీట్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సమావేశంలో ఏమైనా తేడా వస్తే ఈసారి తెలంగాణ తెగేదాకా కొట్లాడుతుందని రాసుకొచ్చారు.

ఈ రోజు తెలంగాణ ప్రజాభవన్ కు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు స్వాగతం. ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు తెలంగాణ ఆకాంక్షలు తెలుసని అనుకుంటుంటున్నా. తెలంగాణ విభజన సమయంలో మీరు నన్ను ఆహ్వానించినప్పుడు నేను అన్ని విషయాలు మీకు వివరించా. మీరు కూడా పెద్దమనసుతో విన్నారు. అంగీకరించారు. రాష్ట్ర విభజనకు ఆమోదించారు. రెండు రాష్ట్రాల ప్రజలం అన్నదమ్ముల్లా విడిపోయాం. ఆత్మీయుల్లా కలిసే ఉంటున్నాం. ఇప్పుడు కూడా ఇవాళ్టి సమావేశంలో తెలంగాణకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సహకరించండి. మా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు కాకుండా పాండవుల మాదిరి మావాళ్లు ఐదు గ్రామాలనే అడుగుతున్నారు. ఇచ్చేయండి.

అలాగే సీఎం రేవంత్‌రెడ్డికి సహకరించి విభజన చట్టానికి అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించండి. 9, 10 షెడ్యూల్‌లో ఉన్న అన్ని సంస్థలను, అందులోని ఉద్యోగులను, వనరులను చట్టం ప్రకారం తీసుకువెళ్లండి. మీరు, మీ వాళ్లు హైదరాబాద్ లో ఉంటారు. ఉండండి. మేం అప్పుడప్పుడు ఆంధ్రాకు చుట్టపు చూపుగానో, పర్యాటకులుగానో వస్తాం. రెండు రాష్ట్రాలు ఒకటే అని భావిస్తూనే రాష్ట్రాల కు చట్టపరంగా రావాల్సిన వాటాల విషయంలో రాజీ పడకుండా పంచుకుందాం.

తేడా వస్తే తెలంగాణ సమాజం తెగిస్తుంది. ఈసారి మళ్ళీ తెగేదాకా కొట్లాడుతుంది. ఇప్పుడు ఆ అవసరం రాకూడదు. కేసీఆర్ అధికారంలో ఉంటే ఆ అవకాశం, గౌరవం ఉండేదో, లేదో కూడా తెలియదు. మా రేవంత్ గారితో ఒక పెద్దన్నగా వ్యవహరించండి. మీరు నిలబడండి! మమ్మల్ని కూడా నిలదొక్కుకోనీయండి. కలిసి ఎదుగుదాం!

ఉభయకుశలోపరి!!

Tags:    

Similar News