యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు‌ అరెస్ట్

తండ్రీ కూతుళ్ల బంధంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రణీత్ హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By :  Vamshi
Update: 2024-07-10 11:24 GMT

తండ్రీ కూతుళ్ల బంధంపై దారుణంగా కామెంట్స్ చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమతును అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ సహా మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

మొదట ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరు పరుస్తారు. ఆ తర్వాత ట్రాన్సిస్ట్ వారెంట్ పై అతడిని హైదరాబాద్ తీసుకురానున్నారు. మిగిలిన ముగ్గురిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులతో కలిసి అడ్డగోలుగా అతడు చేసిన అసభ్యకర కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ఫిర్యాదుతో సీటీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News