మా కడుపు కొట్టడానికే ఇల్లు కూలగొడుతున్నారు.. ప్రభుత్వంపై ఓ మహిళ ఆవేదన

మాజీ సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వు మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్ అంటూ సీఎం రేవంత్‌పై సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది

By :  Vamshi
Update: 2024-09-08 07:19 GMT

హైదరాబాద్ సున్నం చేరువు పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ కూల్చివేతపై ఓ మహిళ కన్నీటి పర్యంతం అయింది. జీహెఎచ్‌ఎంసీ అధికారుల పర్మిషన్ తీసుకోని అపార్ట్మెంట్ నిర్మించామని తెలిపారు. కోర్టులో కేసు ఉండగా ఉండగా కూల్చివేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మా కడుపు కొడుతున్నారని ఆ మహిళ కన్నీరుమున్నీరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వు మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్ అంటూ రేవంత్‌పై రెచ్చిపోయారు బాధిత మహిళ. ఈ సంఘటన అందరినీ కలిచివేస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు కలవరపడుతున్నారు. పైసా, పైసా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకొనో, కొనుక్కొనో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్నావారు. హైడ్రా పేరుతో కూల్చి వేయడంతో వారి పరిస్థితి దిక్కులేని ఏర్పడింది. పెద్ద,పెద్ద బడా బాబుల ఇళ్లు కూల్చివేసిన బాధ లేదు. కానీ పేద ప్రజల ఇళ్లను నేలమట్టం చేయడం యావత్తు తెలంగాణ వ్యతిరేకిస్తుంది.

నగరంలో మరోసారి హైడ్రాకూల్చి వేతలు మొదలయ్యాయి. అక్రమ నిర్మాణాల‌పై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. మేడ్చల్‌ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ప‌రిధిలోని దుండిగ‌ల్‌లోనూ హైడ్రా చ‌ర్యలు చేప‌ట్టింది. మ‌ల్లంపేట్ క‌త్వా చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌లో నిర్మించిన ల‌క్ష్మీ శ్రీనివాస క‌న్‌స్ట్రక్షన్‌ విల్లాల‌ను కూల్చేస్తున్నారు. కూల్చివేత‌లు కొన‌సాగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు.మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News