మున్నేరుకు వరద ప్రవాహం..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఖమ్మం ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లెకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

By :  Vamshi
Update: 2024-09-08 06:00 GMT

మహబూబాబాద్, ఖమ్మం ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లెకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరిలించారు. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం రెడ్ అలర్ట్ జోన్‌లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బంద్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు.

నిన్న మున్నేరు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. ఇవాళ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించానున్నరు. మున్నేరు ప్రాంతాల్లో నేడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను ఆయన పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

Tags:    

Similar News