వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్

వైసీపీ యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు.

By :  Vamshi
Update: 2024-07-27 15:32 GMT

వైసీపీ చంద్రగిరి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రగిరి పులివర్తి నాని కారుపై మోహిత్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో 307 సెక్షన్ కింద మోహిత్‌‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ముందస్తు ప్రణాళికతో సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.

ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు.చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కేటయించారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే

Tags:    

Similar News