'కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను' రెజ్లింగ్‌కు ఫొగాట్‌ గుడ్‌బై

పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌ చేరి 100 గ్రాముల అధిక బరువుతో అనూహ్య రీతిలో అర్హతకు గురైన వినేశ్‌ ఫొగాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించింది.

By :  Raju
Update: 2024-08-08 03:03 GMT

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు తనపై అనర్హత వేటు వేయడంతో మనస్థాపానికి గురైన ఆమె షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల. నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు.' రెజ్లింగ్‌ 2001-2024 గుడ్‌బై అంటూ అని పేర్కొన్నది.

మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడానికి ఫొగాట్‌ సవాల్‌ చేస్తూ కోర్ట్‌ ఆఫ్‌ అర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌)ను ఆశ్రయించింది.తనకు రజత పతకమైనా ఇవ్వాలని అప్పీలులో కోరింది. బుధవారం జరిగిన ఫైనల్‌లో గుజ్‌మాన్‌ లోపేజ్‌ పై అమెరికన్‌ రెజ్లర్‌ సారా హిల్డర్‌ బ్రాంట్‌ గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. లోపేజ్‌తో పాటు తనకు కూడా రజత పతకం ఇవ్వాలని వినేశ్‌ అప్పీల్‌లో కోరింది. దీనిపై కాస్‌ ఇవాళ విచారణ చేసి తీర్పు ఇవ్వనున్నది. ఒకవేళ తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తే ఐవోసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగానే వినేశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు వినేశ్‌ను ఛాంపియన్‌గా భావిస్తూ రూ. 25 లక్షల బహుమతి ఎల్బీయూ ఇవ్వనున్నది. ఒలింపిక్స్‌లో తమ విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించింది

అటు వినేశ్‌ అనర్హత నేపథ్యంలో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్లూడబ్ల్యూ)అధ్యక్షుడు నెనాద్‌ లాలోవిక్‌ స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్‌పై వేటు పడటం బాధాకరం అన్నారు. వినేశ్‌ రాత్రికి రాత్రే బరువు పెరిగిందని తెలిపారు. ఆమె కోసం నిబంధనలు మార్చలేమన్నారు. ఏది ఏమైనా నిబంధనలు గౌరవించాల్సిందేని చెప్పారు. దీనికి వినేశ్‌ మినహాయింపు కాదని రూల్స్‌ మార్చలేమన్నారు. 



Tags:    

Similar News