తెలంగాణలో క్రైమ్ పెరగడంతో.. ఖైదీలతో కిక్కరిసిపోతున్న జైళ్లు

తెలంగాణ వ్యాప్తంగా జైళ్లు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి

By :  Vamshi
Update: 2024-08-20 11:43 GMT

తెలంగాణ వ్యాప్తంగా జైళ్లు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కారాగారాలు నిండిపోయాయి. డ్రగ్స్ కేసులకు సంబంధించిన అరెస్ట్‌లతో చంచల్‌గూడ సెంట్రల్ కారాగారాంలో 1,250 మందిని ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం 2,103 మంది ఖైదీలు ఉన్నారు. సంగారెడ్డి జైలులో 220 మందికి బదులు 569 మంది ఖైదీలున్నారు.

వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేయడంతో అందులోని వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించడంతో వాటిలో రద్దీ పెరిగింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లూ ఖైదీలతో నిండిపోయిన నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేక జైళ్ల శాఖ సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకుగానూ 1,500 మంది సిబ్బందితోనే జైళ్ల శాఖ నెట్టుకొస్తోంది. 400 పోస్టులు ఖాళీగా ఉండటంతో పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా..కొత్త నియామకాలకు ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News