మెడిసిన్ సీట్ల విషయంలో మనవాళ్లకు అన్యాయం చేస్తారా ? కేటీఆర్

స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని, దీనివల్ల మన విద్యార్థులు మెడికల్‌ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు.

By :  Raju
Update: 2024-08-06 08:03 GMT

స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని, దీనివల్ల మన విద్యార్థులు మెడికల్‌ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు.జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం తన వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయి. 9 నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నిర్ణయం ప్రకారం చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకలయ్యే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ హెచ్చరించారు.

2023-24 విద్యా సంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం.దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారు.ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు.దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా...గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News