ఎజెండా కాపీ అందించడంలో ఆలస్యమెందుకో?

శాసనసభ సమావేశాల ఎజెండా కాపీ ఆలస్యంగా పంపడంపై అక్బరుద్దీన్‌, కేటీఆర్‌లు ప్రభుత్వంపై మండిపడ్డారు

By :  Raju
Update: 2024-08-02 07:54 GMT

శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఎజెండా ఖరారు కాపీని సభ్యులకు సకాలంలో అందించకపోవడంపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ ఒక్క రాజకీయ పార్టీల కోరికలపై, ఇష్టంపై అసెంబ్లీ నడవకూడదని, సభలోని సభ్యులందరినీ పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. ప్రతిరోజు మాకు ఎజెండా 1:00 గంటకు వస్తున్నది. మొన్న మాత్రం 1:40 గంటలకు వచ్చిందని, అప్పుడు వస్తే సబ్జెక్టుపై మేము ఎప్పుడు ప్రిపేర్‌ కావాలని ప్రశ్నించారు. తన 25 ఏండ్ల అనుభవంలో సభ ఇలా జరగడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. సమావేశాల ఎజెండా కాపీ ఆలస్యంగా పంపడంపై ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రతిరోజూ అజెండా మారుతున్నదని, సమావేశాల ఎజెండా కాపీని సకాలంలో సభ్యులకు అందించాలి. అప్పుడే సమగ్ర చర్చకు అవకాశం ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News