ఎవరిది నిర్లక్ష్యం? ఎవరిపై వేటు?

తెలుగు పాఠ్యపుస్తకం ముందుమాటలో తప్పులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల ముద్రణ సేవల డైరెక్టర్‌, ఎన్‌సీఈఆర్‌టీ అదనపు డైరెక్టర్‌లను బాధ్యతల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

By :  Raju
Update: 2024-06-14 11:29 GMT

తెలుగు పాఠ్యపుస్తకం ముందుమాటలో తప్పులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల ముద్రణ సేవల డైరెక్టర్‌ శ్రీనివాస చారి, ఎన్‌సీఈఆర్‌టీ అదనపు డైరెక్టర్‌ రాధారెడ్డిలను బాధ్యతల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. టీఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి రమణకుమార్‌ ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.

తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకం పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా నిలిపివేశారు. పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ముందుమాటలో మార్పులు చేయలేదని ప్రభుత్వ వాదన. అయితే ప్రస్తుతం ఆ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోనే ఉన్నది. విద్యాశాఖ మంత్రి హోదాలోనే ఆయన టెట్‌ ఫలితాలతో పాటు విద్యాశాఖకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏటా పుస్తకాల పునర్‌ ముద్రణ సమయంలో స్పెసిమెన్‌ కాపీ సంబంధింత మంత్రిత్వశాఖకు వెళ్తుందని అప్పుడు చూడకుండా ప్రింటింగ్‌ పూర్తయ్యాక అధికారులను బాధ్యులుగా చేసి వేటు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 

Tags:    

Similar News