'నీట్‌'లో ఆ ప్రశ్నకు జవాబు ఏమిటి?: సుప్రీంకోర్టు

నీట్‌పై నిన్న విచారణ సందర్భంగా నీట్‌-యూజీ పరీక్షలో వచ్చిన ఒక ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది.

By :  Raju
Update: 2024-07-23 03:06 GMT

నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలుపేపర్‌ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. నేడు కూడా విచారణ కొనసాగనున్నది. నిన్న విచారణ సందర్భంగా నీట్‌-యూజీ పరీక్షలో వచ్చిన ఒక ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఫిజిక్స్‌ ప్రశ్నకు సంబంధించి రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్కదానికే ఇచ్చారని పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెరిట్‌ లిస్ట్‌ మారే అవకాశం ఉన్నదని దృష్టికి తీసుకెళ్లారు.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన ముగ్గురును నిపుణులను ఏర్పాటు చేయాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆ ప్రశ్నకు జవాబు ఏమిటో చెప్పాలని పేర్కొన్నది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. 

Tags:    

Similar News