వరద బాధితులను తక్షణం ఆదుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితులను తక్షణమే ఆదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-09-02 13:24 GMT

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితులను తక్షణమే ఆదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులతో కలిసి సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులతోపాటు, ఇండ్లు కోల్పోయిన పేదలు, ఇతర బాధితులకు అండగా ఉంటామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు. అధికారుల నివేదిక ప్రకారం సూర్యాపేట జిల్లాలో 11 రోడ్లు ధ్వంసమైయి వాటన్నిటికి మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించడం జరిగిందన్నారు.

ప్రాథమిక నివేదిక ప్రకారం ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతుకు 23 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే రోడ్డులు మరమ్మతులు చేపడతామని తెలిపారు. తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడం జరిగిందని పేర్కొన్నారు. వరదలు వలన పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులతో పాటు, పంచాయతీ రోడ్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పేదలకు, రైతులకు అండగా నిలబడాలని, అధికారులు ఎవరు సెలవు పై వెళ్లకుండా 24 గంటలు పని చేయాలని ఆయన కోరారు.

Tags:    

Similar News