మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పింఛన్‌ పెంచాం: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు.మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం పింఛన్‌ను ఒకేసారి రూ.1000 పెంచి ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

By :  Raju
Update: 2024-06-29 04:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు.మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షల కోసం మమ్మల్ని గెలిపించారో వాటి నెరవేర్చడమే తమ తక్షణ కర్తవ్యమని బాబు తెలిపారు.

మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం పింఛన్‌ను ఒకేసారి రూ.1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ. 6 వేల ఫించన్‌ ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని సీఎం పేర్కొన్నారు. జులై 1 నుంచే పెంచిని పింఛన్లు అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

పింఛన్‌ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ. 819 కోట్ల భారం పడనున్నది. ఎన్నికల సమయంలో మూడు నెలలు కష్టాలు చూసి చలించిపోయానని, మీరు పడిన అగచాట్లు చూశానని, పింఛన్‌ పెంపును వర్తింప చేస్తానని మాట ఇచ్చానని, దాని ప్రకారం పెంచి మీకు అందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 

Tags:    

Similar News