కరెంట్ సమస్యల పరిష్కరానికి వ్యవస్థను ఏర్పాటు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ నగరం పెట్టుబడులకు తలమానికమని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థలు వస్తున్నాయి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By :  Vamshi
Update: 2024-08-08 13:27 GMT

హైదరాబాద్ నగరం పెట్టుబడులకు తలమానికమని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థలు వస్తున్నాయి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫార్మా, బయోటెక్, ఇతర సర్వీస్ రంగాల్లో భాగ్యనగరం లో పెట్టుబడులు పెట్టడానికి మల్టీ నేషనల్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో వినియోగదారులందరికీ కరెంటు నిరంతరం నాణ్యతతో జరగాలని సమీక్ష సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిపారు. వర్షాకాలం నేపద్యంలో గాలులు, వారాల మూలంగా, వైర్లు వంగిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విద్యుత్ వినియోగదారుల సేవల కోసం ఏర్పాటు చేసిన 1912 హెల్ప్ లైన్ కు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. 108 తరహాలో విద్యుత్ సంస్థ హెల్ప్ లైన్ సేవలను విస్తృతం చేస్తామన్నారు. గాలి పీల్చుకోవడం ఒక నిమిషం ఆగిపోతే ఎంత ప్రమాదమో విద్యుత్తు స్తంభిస్తే అంతే ప్రమాదంగా ప్రజలు భావిస్తున్నారని.. మారిన కాలానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది సేవలు పెరగాలని డిప్యూటీ సీఎం తెలిపారు. సిబ్బంది బాగా పనిచేసే ప్రచారం కల్పించుకోవాలి ఇందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి ప్రజల మనసులు తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు.

Tags:    

Similar News