రైతు భరోసా అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం:భట్టి

రైతు భరోసాపై విధి విధానాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నాం. విధి విధానాలు రూపకల్పన చేసి పథకం అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

By :  Raju
Update: 2024-07-10 06:31 GMT

రాష్ట్రంలో ప్రజా పాలనను ఏర్పాటు చేసుకున్నామని. రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రైతు భరోసా విధివిధానాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన సదస్సులో డిప్యూటీ సీఎం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుంటామన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా ఇస్తామని చెప్పాం. రైతు భరోసా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని భట్టి తెలిపారు. ఇప్పటికే రైతు బంధు కింద రైతులకు నిధులు జమ చేశామన్నారు. ఈ నెలలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. రైతు భరోసా విధివిధానాల కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ నియమించామని చెప్పారు.  అభిప్రాయ సేకరణ తర్వాత రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. విధి విధానాలు రూపకల్పన చేసి పథకం అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు.  

చిన్న, సన్నకారు రైతులకు చేయూత ఇవ్వడం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ప్రజలు తమ మనసులోని ఆలోచనలు స్పష్టంగా చెప్పాలని ఆయన కోరారు. ప్రతి జిల్లాలోని రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. 

ఈ సదస్సులు పూర్తయిన రెండు రోజుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తారు. వీటి రైతు భరోసాపై ఏర్పడిన భట్టి, తుమ్మల, పొంగులేటి సభ్యులుగా కమిటీ సమీక్ష చేస్తుంది. రైతు భరోసాపై విధి విధానాలపై అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. 

Tags:    

Similar News