వయనాడ్ విషాదం కలచివేసింది : రాహుల్ గాంధీ

వయనాడ్ విషాదం హృదయాన్ని కలిచి వేస్తోందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషాదాన్ని చూస్తుంటే నోట మాట రావడం లేదని ప్రియాంక అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-01 13:09 GMT

వయనాడ్ విషాదం తన మనుస్సును కలచి వేసిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నా తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో ఇప్పుడు అంతే బాధ కలుగుతోంది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదు..భాదితులకు అండగా ఉండేందుకే ఇక్కడికి వచ్చాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వయనాడ్ విషాదం హృదయాన్ని కలిచి వేస్తోందని రాహుల్ అన్నారు. ఈ ఘోర విషాదాన్ని చూస్తుంటే ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు.

 


హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి ప్రకృతి విలయం సంభవించిందని ప్రియాంక అన్నారు. దీన్ని కచ్చితంగా జాతీయ విపత్తుగా పరిగణించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే వచ్చాను. చాలా మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. ఇళ్లనూ పోగొట్టుకున్నారు. వాళ్లందరినూ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వీలైనంత వరకూ మా వంతు సాయం కచ్చితంగా అందిస్తాం. బాధితులకు పరిహారం అందించే దిశగా కృషి చేస్తాం. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. బాధితులకు సాయం అందిస్తున్న వైద్యులు, నర్స్‌లు, వాలంటీర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాహుల్ పేర్కొన్నారు.

Tags:    

Similar News