వరద నీటిలో మునిగిన ఏడుపాయల వనదుర్గా ఆలయం

మెదక్‌లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం చుట్టు మంజీర వరద నీరు చేరింది. దీంతో ప్రత్యేక పూజల అనంతరం గర్బగుడిని ఆలయ అధికారులు మూసివేశారు.

By :  Vamshi
Update: 2024-09-03 06:49 GMT

మెదక్‌లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం చుట్టు మంజీర వరద నీరు చేరింది. దీంతో ప్రత్యేక పూజల అనంతరం గర్బగుడిని ఆలయ అధికారులు మూసివేశారు. ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనేే ఉంది. భారీ వర్షాలకు కురుస్తుండటంతో మూడు రోజులుగా వరద ఆలయ చుట్టు చేరింది. దీంతో అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన చేశారు. పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు.

వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో పేర్కొన్నారు. ఇక.. మంజీరాకు నక్క వాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంజీరా బ్యారేజ్‌ గేట్లు ఎత్తడంతో ఏ క్షణాన అయినా భారీగా వరద వచ్చే అవకాశముంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News