యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ రాజీనామా

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ వ్యక్తిగత కారణాలతో శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.

By :  Raju
Update: 2024-07-20 04:59 GMT

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌ నెలలోనే మనోజ్‌ సోని బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ఐదేళ్లు ఉండగా.. ఇంతలోనే రాజీనామా చేయడం గమనార్హం. అయితే ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదనిన అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సివిల్ సర్వీసెస్ పరీక్షలపై వివాదం కొనసాగుతున్నది. అయితే ఆయన రాజీనామాకు దీనితో సంబంధం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి.సుమారు పదిహేను రోజుల కిందటే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి. దీనిని ఇంకా ఆమోదించలేదని సదరు వర్గాలు తెలిపాయి. 2017లో యూపీఎస్సీ సభ్యుడిగా చేరిన ఆయన గత ఏడాది మే నెలలో ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే.

Tags:    

Similar News