బొగ్గు గనుల వేలం ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించారు.

By :  Vamshi
Update: 2024-06-21 07:39 GMT

హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దూబే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు హాజరయ్యారు. ఈ వేలంలో సింగరేణి పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అంతకుముందు కిషన్‌రెడ్డితో భట్టి, సింగరేణి సీఎండీ బలరాం భేటీ అయ్యారు. శ్రావణపల్లి గనిని సింగరేణికి కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తుంది.

హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వేదికగా వేలం నిర్వహించనున్నారు.ఒడిశాలోని 16, మధ్యప్రదేశ్‌లోని 15, ఛత్తీస్‌గఢ్‌లోని 15 బొగ్గుగనులు, జార్ఖండ్‌లోని 6, బిహార్, బెంగాల్‌లోని చెరో 3 బొగ్గు గనులు, మహారాష్ట్ర, తెలంగాణాల్లోని ఒక్కో బొగ్గు గనికి మధ్యాహ్నం వేలం నిర్వహించనున్నారు. పర్సంటేజ్‌ రెవెన్యూ షేర్‌ మాడల్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారు. వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం 4 శాతానికి పైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News