వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఏరియల్‌ సర్వే

ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా అతలకుతలమైన విజయవాడ నగరాన్ని కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ గురువారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

By :  Vamshi
Update: 2024-09-05 13:52 GMT

 ఏపీలో వరద ముంపు ప్రాంతాలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. విజయవాడ బూడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను మంత్రి నారా లోకేష్‌తో కలిసి పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వం ఆదుకుంటుందని శివరాజ్ సింగ్ భరోసా కల్పించారు. మరో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో జరిగిన వరద ప్రాంతాల్లో పర్యటించారు.

వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వం ఆదుకుంటామని మాట్లాడారు. గత వైసీపీ పాలనలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల బాగోగుల గురించి పట్టించుకోకపోవడం వల్లే ప్రకృతి వైపరిత్యాలు వచ్చాయని పెమ్మసాని ఆరోపించారు. ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా ప్రతి సంవత్సరం సమీక్షలు నిర్వహించి పకడ్బందీగా నీటివనరులను కాపాడుతామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు నష్టపరిహారం అందిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి నారా లోకేష్‌ వివరించాను.

Tags:    

Similar News