జీవో 46పై నిరుద్యోగుల నిరసన జ్వాల

జీవో 46 పై సోమవారం నిరుద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ పై ఉన్న 50 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరుద్యోగులు ప్లకార్డులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

By :  Vamshi
Update: 2024-07-29 10:36 GMT

జీవో 46పై సోమవారం నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ట్యాంక బండ్‌పై ఉన్న 50 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరుద్యోగులు ప్లకార్డులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జీవో 46 ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి అధికారంలో వచ్చాక హామీని విస్మరించారని మండపడతున్నారు.

46 జీవో వలన గ్రామీణ ప్రాంతాల యువత ఇబ్బందులు పడుతున్నారని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 46 జీవో పై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో సచివాలయన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో తమ పోరాటం ఉదృతం చేస్తామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను పరిష్కరం చేయాలని డిమాండ్ వారు చేశారు

Tags:    

Similar News