బేషరతుగా రూ. 2 లక్షల రుణ మాఫీ చేయాలి: ఈటల

ఎలాంటి కండీషన్స్‌ లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

By :  Raju
Update: 2024-07-18 13:34 GMT

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు ఎలాంటి కండీషన్స్‌ లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనేక నిబంధనలు పెట్టి అందరినీ ఎగ్గొట్టే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రిని కోరారు.

రూ. 34 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఐదారు వేల కోట్ల రూపాయలు విడుదల చేసి దాన్ని పండుగలా, చరిత్రాత్మక దినంగా వర్ణంచే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్‌ కండీషనల్‌గా రైతాంగానికి ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా రుణమాఫీ చేసి, వారిని రుణవిముక్తులను చేయాలని ఈటల డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News