కాళేశ్వరం ఎత్తిపోతల్లో మరో రెండు మోటార్లు ఆన్‌

నంది, గాయత్రి పంపుహౌసుల్లో ఐదేసి మోటార్లతో లిఫ్టింగ్‌.. మిడ్‌ మానేరుకు ఒకటిన్నర టీఎంసీలు తరలింపు

Update: 2024-07-29 08:09 GMT

కాళేశ్వరం ఎత్తిపోతల్లో మరో రెండు మోటార్లను ఆన్‌ చేశారు. నంది (నందిమేడారం), గాయత్రి (లక్ష్మీపూర్‌) పంపుహౌసుల్లో ఆదివారం వరకు నాలుగు చొప్పున మోటార్లను రన్‌ చేయించిన ఇంజనీర్లు సోమవారం ఉదయం రెండు పంపుహౌసుల్లో మరో మోటారు చొప్పున ఆన్‌ చేశారు. మొత్తం ఐదు మోటార్ల ద్వారా నంది పంపుహౌస్‌ నుంచి 16,345 క్యూసెక్కులు, గాయత్రి పంపుహౌస్‌ నుంచి 16,330 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి కడెం ప్రాజెక్టుతో పాటు లోకల్‌ క్యాచ్‌ మెంట్‌ నుంచి వరద కొనసాగుతుండటంతో ఈరోజు సాయంత్రానికి మరో రెండు మోటార్ల చొప్పున ఆన్‌ చేసే అవకాశాలున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ఎల్లంపల్లికి 16,081 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల కోసం వదులుతున్నారు. రిజర్వాయర్‌ లో మొత్తం 20.18 టీఎంసీలకు గాను 17.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎల్‌ఎండీలోకి 12,600 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ నుంచి చేరుతుంది. 27.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ లో సోమవారం మధ్యాహ్నానికి 7.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మిడ్‌ మానేరులోకి ఇప్పటి వరకు 2.50 టీఎంసీల నీళ్లు చేరాయి.




 


Similar News