టీశాట్‌ సేవలను తక్షణమే పునరుద్ధరించాలి: కేటీఆర్‌

టీ శాట్‌ ప్రసారాలు నిలిచిపోవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు.

By :  Raju
Update: 2024-07-16 15:08 GMT

టీ శాట్‌ ప్రసారాలు నిలిచిపోవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు.నిరుపేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వ టీ శాట్‌ టీవీ చానెళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ల్యక్షం వల్ల ఇవ్వాళ మూగబోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారు.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో చేసుకోవాల్సిన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం చేసింది. దీనివల్ల జీశాట్‌ 16 శాటిలైట్‌ సేవలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎస్‌ఐఎల్‌ విరమించుకుంది. టీశాట్‌ సేవలను తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.




 

Tags:    

Similar News