గిరిజనులకు అనేక సంప్రదాయాలు కళలు ఉన్నాయి: చంద్రబాబు

గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని వారు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు.

By :  Raju
Update: 2024-08-09 07:23 GMT

గిరిజనులకు అనేక సంప్రదాయాలు, కళలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేశారు. డప్పు వాయించారు.

ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. అరకు కాఫీ మార్కెటింగ్‌ తదితర అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఆదివాసీలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. గిరిజనులకు అనేక సంప్రదాయాలు, కళలు ఉన్నాయన్నారు. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని వారు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు.మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలన్నారు. ప్రధాని వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించామని చెప్పారు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులన్నారు.ఆదివాసీ దినోత్సం నిర్వహించకోవాలని తమ ప్రభుత్వం జీవో 127 జారీ చేసిందని చెప్పారు.

Tags:    

Similar News