నేడు హైదరాబాద్ పలు ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హైదరాబాద్‌లో పలు ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేడు హైదరాబాద్‌లో పలు ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ పోటీలు గచ్చిబౌలి స్టేడియం నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3, 6, 9 తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోట్రాఫిక్ ఆంక్షలు విధించనట్లుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని జీపీఆర్ఏ క్వార్టర్స్, గోపీచందర్ అకాడమీ, ఇన్ఫోసిస్, విప్రో జంక్షన్ మీదుగా గోపన్‌పల్లి నుంచి లింగంపల్లికి వెళ్లాలని తెలిపారు.
అదేవిధంగా లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో, మసీద్ బండ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలికి రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పొలీసులు తెలిపారు. ఈ రూట్లలో ప్రయాణాలు చేసి ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు.