బక్రీద్ సందర్బంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

బక్రీద్ సందర్బంగా ఓల్డ్ సిటీతోపాటు హైదరాబాద్‌లో పలు ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీసులు తెలిపారు

By :  Vamshi
Update: 2024-06-17 05:47 GMT

నేడు బక్రీద్ పండుగ సందర్బంగా హైదరాబాద్ పలు ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీతోపాటు మాసబ్‌ట్యాంక్‌, మీరాలం దర్గా, లంగర్‌హౌజ్‌ వద్ద ట్రాఫిక్‌ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతించనున్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. బహదూర్ పురా క్రాస్ రోడ్స్, పురానా పూల్, కామతి పూరా, కిషన్ బాగ్ వైపు నుంచి ప్రార్థనకి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం జూపార్క్, మసీదు అల్లా హు అక్బర్ ఎదురుగా వాహనాలు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. కాగా, బక్రీద్ సందర్భంగా గ్రేటర్ పరిధిలో రిటైల్ బీఫ్ దుకాణాలను సోమ, మంగళవారాల్లో మూసివేయాలని అధికారులు ఆదేశించారు.బక్రీద్ ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

Tags:    

Similar News