నేడు పూరీ జగన్నాథుడి రథయాత్ర

ఒడిషాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర నేడు నిర్వహించనున్నారు.. మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి రథం లాగుతారు.

By :  Raju
Update: 2024-07-07 07:39 GMT

ఒడిషాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర నేడు నిర్వహించనున్నారు. జగన్నాథ, జలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా.. పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జన ఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి.

ఈ సారి రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉన్నది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి రథం లాగుతారు. సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

రథయాత్రలో ట్రాఫిక్‌ను, క్రౌడ్‌ను నియంత్రించడానికి మొదటిసాఇర పైలట్‌ ప్రాజెక్టుగా ఏఐ సాంకేతికను వినియోగిస్తున్నారని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇక్కడ 40 చోట్ల సీసీటీవీ కెమెరాలను ఉంచామని, వాటిని ఏతో అనుసంధానిస్తామన్నారు. తద్వారా ఎక్కడ ట్రాఫిక్‌ ఉన్నదో తెలుసుకోవచ్చన్నారు. వీటితో పాటు డ్రోన్‌లను కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు.

ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి యాత్ర. ఈ యాత్రను కళ్లారా చూడాలని కోట్లాది మంది భక్తులు అనుకుంటారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథ కేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాథుని యాత్ర కన్నుల పండుగలా జరగనున్నది. హిందువులు చాలా పవిత్రంగా భావించే 'చార్‌ ధామ్‌' పుణ్యక్షేత్రాల్లో పూరీ ఒకటి. ఇక్కడ చార్‌ ధామ్‌ అంటే బద్రీనాథ్‌, పూరి జగన్నాథ్‌, రామేశ్వరం, ద్వారాకా. ఈ నాలుగు ధామాలను దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం. రెండు రోజుల రథయాత్రలోపాల్గొనడానికి దేశ విదేశాల నుంచి 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు. 

Tags:    

Similar News