తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

By :  Vamshi
Update: 2024-08-20 11:07 GMT

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం ఆదిలాబాద్, మెదక్, పాలమూరుతో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ 21వ తేదీ ఉదయం 8.30 లోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Tags:    

Similar News