తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులు వీరే !

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఫోన్ కాల్స్ వచ్చాయంటున్న పార్టీ వర్గాలు నేడు రాత్రి 7.15 గంటలకు కొలువు తీరనున్న మోదీ సర్కారు

Byline :  Vamshi
Update: 2024-06-09 06:33 GMT

కేంద్ర కేబినేట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌లకు చోటు లభించింది. వీరిద్దరికీ పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మాజీమంత్రి ప్రహ్లాద్‌ జోషి శనివారం కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కిన ఎంపీలకు ఇప్పటికే ఫోన్‌ల ద్వారా సమాచారం అందజేశారు.

ఇందులో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ఉన్నారు. అంతేకాదు.. ఇందులో మాజీ సీఎంలకు కూడా చోటు దక్కింది. అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినట్లు ఆయనకు ఫోన్ కాల్ చేశారు. కాగా ఈ రోజు ప్రధాని మోడీతో పాటు బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వారికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు.

అయితే మోదీ తన క్యాబెనెట్‌లో ఎవరెవరికి చోటుకల్పిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీతోపాటు మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలకు ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ రావాలంటూ ఆహ్వానాలు అందినట్లు తెలుస్తున్నది.ఆ జాబితాలో రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ప్రహ్లాద్‌ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జురామ్‌ రామ్‌ మెఘ్వాల్‌, చిరాగ్‌ పాశ్వాన్‌, అనుప్రియా పటేల్‌, జీతన్‌ రామ్‌ మాంఝీ, జయంత్‌ చౌదరి, హెచ్‌డీ కుమార స్వామి, ఏపీ టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు. వీరంతా మోదీతోపాటు ప్రమాణం చేయనున్నారు. కాగా, కాబోయే మంత్రులకు మోదీ తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

Tags:    

Similar News